జాతీయ వార్తలు

డిజిటల్‌కు మారదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8:దేశ ప్రజలు డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీలు సాగించేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ సమావేశానికి ఆయన గురువారం అధ్యక్షత వహించారు. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా, వివిధ బ్యాంకుల సిఎండీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిశాక ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశ ప్రజల ఆర్థిక లావాదేవీలు చాలావరకు డిజిటల్ పద్ధతిలో జరిగేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పివోఎస్ యంత్రాలు, క్రెడిట్, డెబిట్, ఇతర ఆర్థిక కార్డుల ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం గురించి నేటి సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించటం మంచిదని ఆయన సూచించారు. ఆధార్ ఖాతాల ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు. ఎంపిసిఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ను కూడా ఉపయోగించుకోవచ్చునన్నారు. దేశంలోని అన్ని బ్యాంకులు ఆధార్, ఎంపిసిఐలను ఆమోదించేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తే నగదు రహిత ఆర్థిక లావాదేవీలను సులభంగా చేయొచ్చన్నారు. ఈ అంశంపై బ్యాంకు సిఎండిలతో చర్చించామని ఆయన చెప్పారు. చిన్న నోట్లను వీలున్నంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా గురువారం ప్రకటించిన ప్రోత్సాహకాలు డిజిటల్ లావాదేవీలకు ఎంతో తోడ్పడతాయన్నారు. తమ కమిటీ రెండు మూడు రోజుల్లో తాత్కాలిక నివేదికను ప్రధాన మంత్రికి అందజేస్తుందని తెలిపారు. కమిటీ శుక్రవారం మరోసారి టెలీకాన్ఫరెన్స్ జరుపుతుందని ఆయన తెలిపారు. డిజిటల్ లావాదేవీల్లో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో దీనివలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ లావాదేవీలు అందరికీ అలవాటు కావాలన్నారు. సమాచార చోరీ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. అన్ని బ్యాంకులు యుపిఐ వ్యవస్థలోకి వస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు.

చిత్రం..నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఏపి సిఎం చంద్రబాబు