జాతీయ వార్తలు

నిధులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన కెసిఆర్ జైట్లీని కలిశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల గురించి ప్రత్యేకంగా గుర్తుచేసినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పెద్దఎత్తున సహాయం చేయాలని, విభజన చట్టంలో ఈ మేరకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను వీలున్నంత త్వరగా విడుదల చేయాలని జైట్లీకి విజ్ఞప్తి చేశారు.

చిత్రం..ఢిల్లీలో జరిగిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు హాజరై అనంతరం జైట్లీతో ముచ్చటిస్తున్న కెసిఆర్