జాతీయ వార్తలు

యంత్రాలతో ఇసుక తవ్వకాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: తెలుగు రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపవద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారంటూ ‘రేలా’ స్వచ్చంద సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపవద్దని, ఇసుక తవ్వకాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 25కి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ ట్రిబ్యునల్‌కి ఫొటోలతోసహా సమర్పించారు.
తెలంగాణ న్యాయవాది సంజీవ్ కుమార్ వాదనలు వినిపిసూ, పర్యావరణ శాఖ అనుమతితోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వివరించారు. ఇసుక తవ్వకాలు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతున్నాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. నదుల మధ్యలో ఇసుక తవ్వకాలు జరపడం లేదని కేవలం తీరప్రాంతల్లో మాత్రమే జరుగుతున్నాయని వాదించారు.
ఏపి న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే పర్యావరణ అనుమతులను తీసుకొని యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రాజెక్టులకైతే యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తారా? అని ఏపీ తరపు న్యాయవాదిని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. దీంతో పూర్తి సమాచారాన్ని ట్రిబ్యునల్‌కి సమర్పిస్తామని ఏపీ తరపు న్యాయవాది తెలిపారు. రెండు రాష్ట్రాలు ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను జనవరి 25కి వాయిదా వేస్తున్నట్లు ట్రిబ్యునల్ ప్రకటించింది.