జాతీయ వార్తలు

తవ్విన కొద్దీ నోట్ల కట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/చెన్నై, డిసెంబర్ 9: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నాయకుడు, పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్ళలో శుక్రవారం రెండో రోజు కూడా ఎసిబి అధికారులు తనిఖీలు
కొనసాగించారు. ఇప్పటివరకు పది కోట్ల విలువైన కొత్త నోట్లుసహా 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో అనేకచోట్ల కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడినా, ఇంత భారీ మొత్తంలో ఎక్కడా పట్టుబడలేదు. రెండోరోజు తనిఖీలు పూర్తయ్యే సమయానికి మరో రూ.17 కోట్ల నగదును ఐటి అధికారులు గుర్తించడంతో ఇందులో కొత్త కరెన్సీ ఎంతవుందనే చర్చ తమిళనాడులోనే కాకుండా టిటిడి వర్గాల్లోను జోరుగా కొనసాగుతోంది. కాగా, ధృవ అనే ఏజంట్ ద్వారా రూ. 80 కోట్ల విలువైన పాత నోట్లు మార్చుకున్నట్లు శేఖర్‌రెడ్డి ఐటి అధికారుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది.
శేఖర్‌రెడ్డి, ఆయన బంధువులైన శ్రీనివాసులురెడ్డి, ప్రేమ్‌ల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి అధికారుల దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈక్రమంలో విలువైన దస్త్రాలను గుర్తించి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాడుల్లో ఇప్పటివరకు రూ.96.89 కోట్ల విలువైన రద్దయిన వెయ్యి, 500 రూపాయల నోట్లతో పాటుగా రూ 9.63 కోట్ల విలువైన కొత్త 2వేల రూపాయల నోట్లు పట్టుబడ్డాయని ఆదాయం పన్ను డిపార్ట్‌మెంట్‌కు చెందిన విధానాలను రూపొందించే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) శుక్రవారం ఢిల్లీలో ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే కాకుండా సుమారు రూ.36.29 కోట్ల విలువైన 127 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిబిడిటి తెలిపింది. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ 142.81 కోట్లు ఉంటుందని అంచనా. ఐటి అధికారులు చెన్నైలో విడుదల చేసిన ఫోటోల్లో పాత కొత్త నోట్ల కట్టలు పేర్చిన పెద్ద అట్టపెట్టెలు, మెరిసిపోతున్న బంగారు కడ్డీలు పక్క పక్కనే ఉండడం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరక్క మానదు.
శేఖర్‌రెడ్డి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద భారీ కాంట్రాక్ట్‌లు చేస్తున్నారని, ఈ సొమ్మంతా తాను సొంతంగా సంపాదించుకున్నదేనని ఆయన చెప్తున్నారని, దర్యాప్తులో కానీ వాస్తవాలు తేలవని అధికారులు చెప్తున్నారు. కాగా శేఖర్‌రెడ్డి వద్ద పట్టుబడిన సొమ్ము నల్లధనం అయిన పక్షంలో ఆయనను టిటిడి బోర్డు సభ్యుడి పదవినుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాల రావు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శుక్రవారం చెప్పారు.