జాతీయ వార్తలు

భారీగా.. పెట్రో వడ్డన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలుపై లీటరుకు 2.21పైసలు, డీజిల్‌పై 1.79పైసలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల ధరల్ని గురువారం నుంచే పెంచాలని భావించినప్పటికీ పార్లమెంట్‌లో ఎక్కడ గొడవ జరుగుతుందోనన్న ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని కేంద్రం నేటికి వాయిదా వేసింది. స్ధానిక పన్నులతో సంబంధం లేకుండా కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో వ్యాట్‌తో కలుపుకుని పెట్రోలు లీటరు ధర 2.84 పైసలకు, డీజిల్ ధర లీటరుకు 54.68 పైసలకు చేరుకుంటుంది. అంతర్జాతీయ చమురు రేట్ల ప్రకారం ప్రతి నెల ఒకటి, 16 తేదీల్లో చమురు ధరల్ని సవరిస్తారు. తాజా పెరుగుదలకు కారణం అంతర్జాతీయ ముడి చమురు ధర భారీగా పెరగడమేనని చెబుతున్నారు.