జాతీయ వార్తలు

ఒక్కసారే చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఆర్బీ ఐ కొత్త షరతులు విధించింది. నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 50రోజుల గడువు డిసెంబర్ 30కి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రద్దయిన పాతనోట్లను డిపాజిట్ చేసే వారికి తాజా షరతులు విధించింది. డిపాజిట్ మొత్తం రూ.5 వేలు దాటితే ఒక్కసారి మాత్రమే జమ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎంత మొత్తం డిపాజిట్ చేసినప్పటికీ, ఏకమొత్తంలో ఒకేసారి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత నుంచి గత నలభై రోజులుగా పెద్ద మొత్తంలో నగదును ఇంతకాలం ఎందుకు డిపాజిట్ చేయలేదో సంతృప్తికరమైన జవాబు బ్యాంకర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5వేలకు మించిన డిపాజిట్లకు కెవైసిలు తప్పనిసరి అని కూడా ఆర్బీఐ సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. కెవైసిలు పూర్తి చేయని వారికి వారి ఖాతా లావాదేవీలు జరుగుతున్న తీరుతెన్నులను చూసి కొన్ని షరతులతో రూ.50వేల వరకు డిపాజిట్లు చేయించుకుంటారు. రూ.5వేలకు మించి డిపాజిట్లు చేసేవారు బ్యాంకింగ్ ప్రక్రియకు సంబంధించిన నియమావళిని పాటించాల్సి ఉంటుంది. బ్యాంకర్లు నిర్దేశించిన గుర్తింపు కార్డులను చూపించి ఆ తరువాత కానీ, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తమ పక్షాన ఇతరులు డిపాజిట్ చేసినా ఈ షరతులు వర్తిస్తాయి. అంతే కాదు, ఖాతాదారుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.