జాతీయ వార్తలు

ఒప్పందాలు కుదిరాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: ముంబయిలో జరుగుతున్న మారిటైం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ నుంచి ముంబైలో జరుగుతున్న సదస్సుకు వెళ్లారు. కాకినాడ నుంచి పుదుచ్చేరికి నేషనల్ వాటర్‌వే అభివృద్ధి చేయడానికి ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు 888 కిలోమీటర్ల నిడివిగల ఈ కాలువ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐడబ్ల్యుఎఐతో ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో ఇటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నది మన రాష్టమ్రే కావడం గమనార్హం. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ డ్రెడ్జర్ల మరమ్మతు చేస్తారు. దీంతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆసియాలోనే ఇటువంటి హార్బర్‌ను తొలిసారిగా అంతర్వేదిలో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.