జాతీయ వార్తలు

ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20:రానున్న పర్వదిన రోజుల్లో భారత్‌లో తీవ్రస్థాయిలో ఉగ్రవాద దాడులు చేసేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులకు, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న వారికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ఆధారంగా దాడుల కుట్రను పసిగట్టినట్టు స్పష్టం చేశాయి. ఏ క్షణంలోనైనా దేశంలో ఉగ్రవాడులు జరిగే అవకాశం ఉన్నందున ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు వెల్లడించాయి. ఆధీన రేఖ ప్రాంతంలో తాలిబన్ మిలిటెంట్లు కదలికలను గుర్తించామని,పష్తూ భాషలోనే వీరి మధ్య సంభాషణలు జరిగాయని తెలిపాయి. ఐఎస్‌ఐ, అఫ్గాన్ మిలిటెంట్ల సాయంతో తాలిబన్లనే తాజా దాడులకు వినియోగించుకునేందుకు కుట్ర జరుగుతున్నట్టుగా వెల్లడించాయి. స్వాట్ లోయ ప్రాంతంలోనూ, తోరాబోరా పర్వతాల్లోనూ ఉగ్రవాద దాడులకు సంబంధించి వీరికి శిక్షణ ఇచ్చి ఉండవచ్చునని ఇంటెలిజన్స్ బ్యూరో వర్గాలు తెలిపాయి.్భరత్‌లో తీవ్ర స్థాయిలో దాడులు చేసే ఉద్దేశంతోనే తాలిబన్ మిలిటెంట్లకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇచ్చినట్టుగా స్పష్టమవుతోందని తెలిపాయి.గతంలో ఉన్నట్టుగా ఐఎస్‌ఐకి మిలిటెంట్ల కొరత ఏర్పడటంతోనే తాజా దాడులకు తాలిబన్లు, అఫ్గాన్ మిలిటెంట్లను నియోగించాలని నిర్ణయించినట్టుగా కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ లక్షిత దాడులు చేసినప్పటి నుంచీ మిలిటెంట్ దాడులు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు, సీమాంతర కాల్పులు తీవ్రమయ్యాయి.