జాతీయ వార్తలు

విద్యతోనే ఉన్నత శిఖరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: ఉర్దూ భాష ఉన్నతిలో ఉర్దూ వర్శిటీ పాత్ర చాలా కీలకమైందని వౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (ఎంఎఎన్‌యుయు) కులపతి జాఫర్ యూనుస్ సరేశ్ వాలా పేర్కొన్నారు. ఉర్దూ యూనివర్శిటీ ఆరో స్నాతకోత్సవం హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు, ఉర్దూ భాషాభిమాని రేక్‌తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్‌కు ఉర్ద్భూష, సంస్కృతిల అభివృద్ధికి వారు చేసిన అసాధారణ కృషికి గానూ గౌరవ డి లిట్ పట్టాను ప్రదానం చేశారు. ఉర్దూ వర్శిటీ కులపతి జాఫర్ యూనుస్ సరేశ్ వాలా ఈ డిగ్రీలను అందజేశారు. షారూఖ్‌ఖాన్, సంజీవ్ సరాఫ్ డిలిట్ ఇచ్చింనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా షారూక్‌ఖాన్ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అత్యవసరమైన అంశమని, ప్రజలు వారి బలాలపై ఆధారపడి వారి కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు సృజనాత్మకమైన విశ్వాసాన్ని అలవరచుకోవాలని, వారి వారి లక్ష్యాలను అందుకోవడానికి వీలుగా ఎదగాలనే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు వారి అంతర్‌దృష్టిని క్రియాశీలంగా ఆవిష్కరించుకొని వారి ప్రవర్తనలో మార్పులు చేసుకుంటూ ఆశించిన ఫలితాలను సాధించాలని ఖాన్ చెప్పారు. విజయాలను కైవసం చేసుకోవాలంటే అందుకు తగ్గ రిస్క్ తీసుకోవాలని, అపజయాల నుండి పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
యూనివర్శిటీ కులపతి జఫర్ యూనుస్ సరేశ్ వాలా ప్రసంగిస్తూ, ఉర్ద్భూష ఉన్నతిలో ఉర్దూ వర్శిటీ పాత్ర కీలకమైనదని అన్నారు. ఉర్దూ మాద్యమంలో ఉన్నత విద్యకు బాట వేయడమే కాకుండా, సాధారణ పాఠ్యప్రణాళికల ఆధారితమైన విద్యా బోధనతోపాటు దూరవిద్యా పద్ధతిలో విద్యాబోధన, ముఖ్యంగా మహిళల్లో విద్య వ్యాప్తికి ఈ యూనివర్శిటీ పాటుపడుతోందని ఆయన చెప్పారు. గ్రాడ్యూయేట్‌లు, పోస్టు గ్రాడ్యూయేట్‌లు కలుపుకుని 2885 మంది విద్యార్ధులు, రెగ్యులర్ కోర్సులలో వేర్వేరు విభాగాలకు చెందిన 276 మంది ఎంఫిల్, పిహెచ్‌డిలను ప్రదానం చేశారు. అలాగే దూరవిద్య పద్ధతిలో గ్రాడ్యూయేట్‌లు, పోస్టు గ్రాడ్యూయేట్లు కలుపుకుని 46,235 మందికి డిగ్రీలను వారి పరోక్షంలో అందజేయనున్నారు.

చిత్రం..బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు గౌరవ డిలిట్ పట్టాను ప్రదానం చేస్తున్న ఉర్దూ వర్శిటీ కులపతి జాఫర్ యూనుస్ సరేశ్ వాలా