జాతీయ వార్తలు

31నుంచి బడ్జెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 31నుంచి ప్రారంభం కానున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈమేరకు నిర్ణయించారు. తొలిరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేసే ప్రసంగంతో 2017-18 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న 12 గంటలకు వార్షిక ప్రణాళికను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. వార్షిక ప్రణాళికలోనే 2017-18 రైల్వే బడ్జెట్ మిళితమై ఉండటం ఈసారి ప్రత్యేకత. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రతిపాదించాలని నరేంద్ర మోదీ గతంలోనే నిర్ణయించటం తెలిసిందే. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఆఖరును ప్రతిపాదించటం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్‌లో స్టాక్ మార్కెట్ మూసివేసే సమయానికి అంటే సాయంతం 4 గంటల ప్రాంతంలో సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదించే వారు. అయితే గతంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ సంప్రదాయాన్ని మార్చింది. సాయంత్రం 4కు బదులు మధ్యాహ్నం 12కు ప్రతిపాదించే విధానం అమల్లోకి తెచ్చింది. బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి పాత బ్రిటీష్ విధానాన్ని పక్కనపెట్టి మన పద్ధతిలో ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదించబోతోంది. మొదట నిర్ణయించిన ప్రకారమైతే సాధారణ బడ్జెట్‌ను జనవరిలోనే ప్రతిపాదించాలని అనుకున్నారు. అయితే అలా చేయటం వలన ఆర్థిక పంపిణీకి సంబంధించిన కొన్ని చిక్కులు ఎదురయ్యే ప్రమాదం కనిపించటంతో, ఫిబ్రవరి 1నాటికి మార్చటం తెలిసిందే. బడ్జెట్ మొదటి దశ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం పార్లమెంటరీ వ్యవహారాల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదానికి పంపించారు. ఇదిలావుంటే, బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి ఆఖరు నుంచి కాకుండా జనవరి నుంచి ప్రారంభించటాన్ని ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
సగటు మనిషికి రాయితీలు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న లోక్‌సభలో సగటు మనిషికి పలు రాయితీలు ప్రకటించొచ్చని అంటున్నారు. ఆదాయ పన్ను పరిమితిని రెండున్నల లక్షల నుంచి మూడున్నర లక్షలకు పెంచవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి కేంద్రం పలు చర్యలు ప్రతిపాదించే చాన్స్ లేకపోలేదు. అయితే జనాకర్షణ పథకాలకు బడ్జెట్‌లో ఎలాంటి స్థానం ఉండదంటూ, సగటు మనిషి ప్రయోజనాల కోసం ప్రతిపాదించే అన్ని పథకాలు కూడా హేతుబద్దంగా ఉంటాయని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. బడ్జెట్‌లో ఆర్థిక పరమైన రాయితీలు ఉంటాయని మంత్రి అరుణ్‌జైట్లీ పలుమార్లు సూచన ప్రాయంగా చెప్పటం తెలిసిందే. పన్నులు తగ్గించటం ద్వారా చెల్లింపుదారుల సంఖ్య విస్తృతపర్చాలన్నది జైట్లీ యోచన. ప్రజలపై పన్నుల భారం తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన ఇటీవల ఐఆర్‌ఎస్ అధికారుల శిక్షణ సమావేశంలో మాట్లాడుతూ చెప్పటం తెలిసిందే.