జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయం మాదే: బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జనవరి 5: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తానన్న ధీమాను బిజెపి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ స్వాగతించారు. ఒకే దశలో ఫిబ్రవరి 15న పోలింగ్ జరుగనుంది. ‘ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము పూర్తిగా సిద్ధమయ్యాం. ఈ అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామన్న విశ్వాసం మాకు ఉంది’ అని ఆయన ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థతలే ఆ పార్టీని ఓడిస్తాయని, బిజెపి మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ పార్టీ విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు.