జాతీయ వార్తలు

విభజనపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ఉమ్మడి ఆంధ్ర విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఆవిర్భవించి రెండేళ్లవుతుంటే, విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లు తాజాగా సోమవారం విచారణకు వచ్చాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉమ్మడి ఏపీని విడగొట్టారంటూ 2014లోనే వివిధ వర్గాలనుంచి సుప్రీంలో దాఖలైన సవాల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం సాధారణ విచారణకు స్వీకరించింది. ప్రజలు కోరుకున్నందునే ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన జరిగింది కదా అని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం, విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ పెండిగ్‌లోవున్న పిటిషన్లును విచారణకు స్వీకరించినట్టు ప్రకటించింది. అయితే, పిటిషన్లపై సాధరణ విచారణ మాత్రమే చేపడతామని స్పష్టం చేసింది. పిటిషన్లపై కేంద్రం ఇప్పటివరకూ కౌంటర్ దాఖలు చేయకపోతే, వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. విభజన బిల్లు ఆమోదం పొందిందని రుజువేమిటి? అని ప్రశ్నిస్తూ, బిల్లు ఆమోదం పొందే సమయంలో పార్లమెంట్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసి, తలుపులు ముసేశారని, ఈ అంశంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌తో అఫిడవిడ్ దాఖలు చేయించాలని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అలాగే రాష్ట్ర విభజనను ప్రజలంతా కోరుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2014లో ఉమ్మడి ఏపీ విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ, రాష్ట్రాల విభజనకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, తెలంగాణ వికాస కేంద్రం, రాజమోహన్‌రెడ్డి, అడుసుమిల్లి జయప్రకాష్, కర్ణాటక తెలుగు సంఘం, రఘురామ కృష్ణంరాజులతో పాటు దాదాపుగా 26 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహెర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ముందుగా తెలంగాణ వికాస కేంద్రం తరఫు న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్రాల విభజనకు అవసరమైన స్పష్టమైన ప్రాతిపదిక జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఎపీ రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మద్రాసు నుంచి గతంలో ఆంధ్ర విడిపోవడం జరిగిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీని విభజించే సమయంలో స్పష్టమైన ప్రాతిపదికను ప్రామాణికంగా తీసుకోలేదన్నారు. దాని ఫలితంగా రాష్ట్ర విభజన పూరె్తైన తరువాత, పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాల్లో ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపారని వాదించారు. ఇది కూడా ఏకపక్షంగానే జరిగిందని, ఇప్పుడు దాని మూలంగా అక్కడి గిరిజనులు అవస్థలు పడుతున్నారని వాదించారు. రాష్ట్ర విభజన సమయంలో సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించే విధంగా అవసరమైన సమాఖ్య సూచిక అవసరం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది ఏడీఎన్ రావు వాదనలు వినిపిస్తూ ఏపీ విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందినట్టు ఆధారం ఏమిటి? అని అనుమానం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో లోక్‌సభలో విద్యుత్ సరఫరా నిలిపివేసి, తలుపులు మూసేశారని వాదించారు. బిల్లు ఆమోదంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్లుపై కేంద్రం ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదని, ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది గల్లా సతీష్, పద్మనాభరావు ధర్మాసనాన్ని కోరారు.
ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే ఏపీ విభజన చేపట్టినట్టు కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పరంజీత్ సింగ్ పట్వాలియా కోర్టు దృష్టికి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం చేపట్టిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిందని కోర్టుకు వివరించారు. విభజనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పడిన పిటిషన్లపై కేంద్రం తరఫున కౌంటర్ దాఖలు చేశామని వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహెర్ జోక్యం చేసుకొని ఏపీ రాష్ట్ర విభజన ప్రజలు కోరుకున్నారని, వారి అభీష్టం మేరకే విభజన జరిగింది కదా అని వ్యాఖ్యానించారు. దీంతో విభజన రాష్ట్ర ప్రజలంతా కోరుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది ఏడిఎన్ రావు కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన ప్రక్రియ హేతుబద్ధంగా జరగనందున విభజన ప్రాతిపదిక జారీ చేయాలని న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదించారు. దీంతో పిటిషనర్ల న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. అన్ని పిటిషన్లను కలిపి పూర్తిస్థాయి విచారణ చేపడతామని ప్రకటించిన ధర్మాసనం, అనంతరం విచారణను వాయిదా వేసింది.