జాతీయ వార్తలు

వారంపాటు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: జల్లికట్టుపై తీర్పును వారం వరకూ ఇవ్వొద్దన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించింది. పిటిషన్లపై విచారణలను వారంపాటు వాయిదా వేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి ఈ అంశంపై వాదనలు వినిపించారు. జల్లికట్టు నిషేధంపై రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న పరిస్థితుల్లో తీర్పు వెలువడితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళనను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఈ నేపథ్యంలో విచారణ వాయిదా వేయడం ఉత్తమమని వాదించారు.