జాతీయ వార్తలు

జల్లికట్టుపై జజ్జనకరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 20: జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ మెరీనా తీరం పోటెత్తింది. సంస్కృతిపై దాడిని నిరసిస్తూ, జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలన్న డిమాండ్‌తో తమిళులు భగ్గుమన్నారు. తీరం వేదికగా నాలుగు రోజుల క్రితం విద్యార్థులు మొదలుపెట్టిన ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభించటంతో శుక్రవారానికి ఉద్యమం మరింత ఊపందుకుంది. అటు రాష్ట్రం, ఇటు కేంద్రంపై వత్తిడి పెరిగేలా ప్రజా సంఘాలు, సినిమా ప్రముఖులు, వివిధ వర్గాల ప్రజలు దాదాపు లక్షమంది మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగడంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ మెరీనా బీచ్‌లో ‘జల్లికట్టు’ నినాదాల హోరు పెంచారు. వివిధ ప్రాంతాల నుంచి మోటారు సైకిళ్లు, కార్లు, ఇతర వాహనాలపై విద్యార్థులు పెద్దఎత్తున మెరీనాకు ర్యాలీగా చేరుకోవడంతో కామరాజర్ ప్రాంతం స్తంభించింది. ఎకతాటిపై సాగుతోన్న ప్రజాందోళనకు ఇప్పటి వరకూ తెరవెనుక మద్దతు ప్రకటించిన సినిమా, వివిధ వర్గాల ప్రముఖులు సైతం శుక్రవారం బహిరంగ వేదికపైకి వచ్చారు. తలైవా రజనీకాంత్, స్టార్ హీరోలు అజయ్, సూర్య, ఇతర సినీ ప్రముఖులు మెరీనా బీచ్‌కు హాజరై ప్రజాందోళనకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే కమల్‌హాసన్‌లాంటి సీనియర్లు బహిరంగంగా జల్లికట్టుకు మద్దతు ప్రకటించటం, మ్యూజిక్ మాస్ట్రో ఎఆర్ రెహ్మాన్ ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తానని ట్వీట్ చేయడంతో ప్రజాందోళన మరింత బలోపేతమైంది.
ఇదిలావుంటే, శుక్రవారం మెరీనా బీచ్‌లో పోటెత్తిన విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు చిత్ర విచిత్ర విన్యాసాలతో జల్లికట్టు నిషేధంపై నిరసనలు ప్రకటించారు. అటు రహదారులు, ఇటు లోకల్ రైల్వే ట్రాక్‌లను స్తంభింపచేసి ప్రమాదకరరీతిలో విన్యాసాలు ప్రదర్శించారు. ప్రజాందోళనకు పెద్దఎత్తున హాజరైన కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, ‘నందీశ్వర’ జెండాలతో సంస్కృతీ సంప్రదాయ ప్రదర్శనలకు తెరలేపితే, తమిళ సంస్కృతిని ఎలుగెత్తిచాటే జాతీయ ప్రజాకవి భారతి ప్రబోధ గీతాలతో మెరీనా బీచ్‌లో చిత్రమైన వాతావరణం ఆవిష్కతమైంది.
ఆహ్వానించదగ్గ నిర్ణయం: డిఎంకె
జల్లికట్టుపై సిఎం పన్నీర్ సెల్వం తీసుకున్న ఆర్డినెన్స్ నిర్ణయం ఆహ్వానించ తగినదని ప్రతిపక్ష డిఎంకె ప్రకటించింది.
డిఎంకె వర్కింగ్ ప్రసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘విన్యాస జంతువుల’ క్యాటగిరీ నుంచి ఎద్దులను శాశ్వతంగా తప్పించేలా కేంద్రాన్ని ఒప్పించగలిగితే ఏటా జల్లికట్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని సూచించారు. ఈ డిమాండ్‌కు బలం చేకూర్చి కేంద్రం దృష్టికి తెచ్చేందుకు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో శనివారం దీక్ష నిర్వహించే యోచన చేస్తున్నట్టు ప్రకటించారు. జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని, ఈ విషయంలో ఎలాంటి ఆలస్యాన్ని సహించేది లేదని ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.
ద్రవిడ సంస్కృతిపై దాడి:పవన్
జల్లికట్టు, కోడిపందాలపై నిషేధం ద్రవిడ సంస్కృతిపై దాడేనని జనసేన నాయకుడు, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జల్లికట్టుకు మద్దతు ప్రకటిస్తూ, సంప్రదాయ పరిరక్షణకు తమిళులు చేస్తున్న పోరాటాన్ని గౌరవించాలని ట్వీట్ చేశారు.

చిత్రం..జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయలాని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంబాలం రైల్వే స్టేషన్‌లో రైల్ రోకో చేస్తున్న
డిఎంకె నేత స్టాలిన్, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు