జాతీయ వార్తలు

41కి చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 22: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొమరాడ మండలం కూనేరులో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ శనివారం అర్థరాత్రి సమయంలో కూనేరు రైల్వే కేబిన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో ఒక ఎసి, నాలుగు జనరల్, రెండు స్లీపర్ బోగీలు తునాతునకలై పోయాయి. అక్కడికక్కడే 41 మంది దుర్మరణం పాలుకాగా 70 మంది గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న పది మందిని విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. మరో 35 మందిని రాయగడ ప్రభుత్వ ఆసుపత్రికి, 25 మందిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురికావడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, హోం మంత్రి రాజ్‌నాధ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడంతో పాటు క్షత గాత్రులు త్వరితగతిన కోలుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.
మొత్తం 7లక్షల పరిహారం
హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెంది న వారి కుటుంబాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.7 లక్షలు
నష్టపరిహారాన్ని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఈ ప్రకటన చేశారు. క్షతగాత్రులకు పాతిక వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
మృతదేహాల వెలికితీత
కూనేరు రైల్వే స్టేషన్‌కు వందమీటర్ల దూరంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. కాగా, ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న అధికారులు తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నారు. అప్పటివరకు క్షతగాత్రులు హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. భువనేశ్వర్ నుంచి కూనేరు చేరుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ఆదివారం ఉదయం నుంచి సహాయ చర్యలు ప్రారంభించినప్పటికీ సాయంత్రానికి గాని మృతదేహాలను బయటకు తీయలేకపోయింది. మిగిలిన ప్రయాణికులను అక్కడనుంచి తరలించేందుకు ఆర్టీసీ 15 బస్సులను కూనేరు నుంచి పార్వతీపురం వరకు నడిపింది. ఒడిశా నుంచి మరో ఐదు ప్రైవేటు బస్సులను రప్పించి రాయగఢ వరకు ప్రయాణికులను చేరవేశారు. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సమీపంలో సరైన ఆసుపత్రులు లేకపోవడంతో పార్వతీపురం, కెజిహెచ్, రాయగఢ ఆస్పత్రులకు తరలించారు.
క్షతగాత్రులకు సహాయ చర్యలు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినప్పటికీ సహాయ చర్యలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రైలు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో గ్యాస్ కట్టర్‌తో వైర్లను కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు. దీంతో ఎంత మంది మృతి చెందారన్నదీ సాయంత్రంవరకు అధికారులు నిర్ధారణకు రాలేకపోయారు. తొలుత ఆరుగురు మృతి చెందారని ప్రకటించిన అధికారులు ఆ తరువాత గంట గంటకు మృతుల సంఖ్య పెంచుతూ వచ్చారు. చివరకు 41 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇరుకు రోడ్లు కావడం, ప్రమాదస్థలి వద్దకు జనం పెద్దయెత్తున తరలిరావడంతో క్షతగాత్రులను తరలించడం కష్టసాధ్యమైంది. పోలీసులు ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు చాలా సమయం పట్టింది. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జెసి లఠ్కర్, డిఐజి శ్రీకాంత్, ఎస్పీ ఎల్‌కెవి రంగారావు, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆదిత్య ప్రసాద్, రాయగఢ డిఐజి ప్రమోద్‌మహదేవ్ తదితరులు సహాయ చర్యలను పర్యవేక్షించారు.

చిత్రాలు..విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

*సంఘటనా స్థలాన్ని సందర్శించిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు