జాతీయ వార్తలు

‘శక్తిమాన్’ ఇక లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, ఏప్రిల్ 29: గత నెల నగరంలో బిజెపి నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడిన పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ నెల రోజులకు పైగా ఇన్‌ఫెక్షన్, ఇతర సమస్యలతో పోరాడిన అనంతరం బుధవారం సాయంత్రం చనిపోయింది. సాయంత్రం అయిదున్నరగంటల సమయంలో శక్తిమాన్ చనిపోయిందని, మరణానికి కారణమేమిటో పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని ఐజి గర్వాల్ గుంజ్యాల్ చెప్పారు. గత మార్చి 14న జరిగిన బిజెపి నిరసన ప్రదర్శన సందర్భంగా ఈ గుర్రం కాలికి గాయాలు కావడం, నొప్పితో కాలు ఈడుస్తూ నడుస్తూ ఉండిన గుర్రం దృశ్యాలు టీవీలో ప్రసారం అయినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేవాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఆపరేషన్ తర్వాత అమెరికానుంచి తెప్పించిన కృత్రిమ కాలుకు గుర్రం స్పందించలేదని డాక్టర్లు చెప్పారు. గత కొద్ది వారాలుగా ఈ గుర్రం డెహ్రాడూన్ పోలీసు లైన్స్‌లోనే గడిపింది. 13 ఏళ్ల వయసున్న ఈ గుర్రం చక్కటి శిక్షణ పొందిందే కాక కొనే్నళ్లుగా ఉత్తరాఖండ్ వౌంటెడ్ పోలీసుదళంలో సేవలందించింది. ఇదిలా ఉండగా గుర్రంపై దాడికి కార్యకర్తలను రెచ్చగొట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న బిజెపి ఎమ్మెల్యే గణేశ్ జోషీ శక్తిమాన్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, శక్తిమాన్ గాయపడ్డంలో తన ప్రమేయం ఏమీ లేదని, ఒక వేళ తాను తప్పు చేసినట్లు తేలితే తన కాలు నరికేయండని అన్నారు. కాగా, విధి నిర్వహణలో మృతి చెందిన శక్తిమాన్ కూడా వీర జవానుతో సమానమేనని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు.