జాతీయ వార్తలు

‘పారిస్’కు భారత్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత ఏడాది డిసెంబర్‌లో వాతావరణ మార్పుపై 190కి పైగా దేశాలు ఆమోదించిన చరిత్రాత్మక పారిస్ ఒప్పందంపై భారత్ వచ్చే శుక్రవారం న్యూయార్క్‌లో సంతకం చేయనుంది. ఫ్రెంచ్ రాజధానిలో జరిగిన 21వ భాగస్వామ్య దేశాల సదస్సులో ఆమోదించిన ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి కేంద్రమంత్రివర్గం బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ నెల 22న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంతకాల కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ భారత్ తరఫున ఈ ఒప్పందంపై సంతకం చేస్తారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాల రూపకల్పన సదస్సు రూపొందించిన నిబంధనలు, సూత్రాల ఆధారంగా ఒక పటిష్ఠమైన, ఆచరణ యోగ్యమైన ఒప్పందాన్ని రూపొందించాలని, ఆ ఒప్పందం భారత్ లేవనెత్తిన అన్ని ముఖ్యమైన అనుమానాలు, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని మన దేశం పారిస్ సమావేశంలో గట్టిగా పట్టుబట్టిన విషయం తెలిసిందే.
న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో రికార్డు సంఖ్యలో 150కి పైగా దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇంతకు ముందు 1994లో మోంటెగో బేలో ఏర్పాటు చేసిన సంతకాల కార్యక్రమంలో అంతర్జాతీయ సముద్ర జలాల ఒప్పందంపై ఒకే రోజు 119 దేశాలు సంతకాలు చేయడం ఒక రికార్డుగా ఉండింది. ఇప్పుడు ఆ రికార్డును పారిస్ ఒప్పందం బద్దలు కొట్టి కొత్త రికార్డు సృష్టించనుంది. ఈ సంతకాల కార్యక్రమం పారిస్ ఒప్పందం వీలయినంత త్వరలో అమలులోకి రావడానికి తొలి మెట్టు అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా వెలువడే మొత్తం కర్బన ఉద్గారాల్లో 55 శాతానికిప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం 55 దేశాలు ఒప్పందానికి ఆమోదముద్ర వేసిన పత్రాలను కానీ, అంగీకారాన్ని కానీ ఐరాస ప్రధాన కార్యదర్శికి అందజేసిన 30 రోజుల తర్వాత ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. వాతావరణంపై అంతర్జాతీయ సహకారంలో పారిస్ ఒప్పందం ఒక మైలురాయని ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.