అంతర్జాతీయం

సొంత రాష్ట్రం న్యూయార్క్‌లో హిల్లరీ, ట్రంప్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్ష పదవికి ప్రధాన పార్టీలయిన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో అందరికన్నా ముందు న్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు అత్యంత కీలకమైన తమ సొంత రాష్ట్రం న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా రేసులో ఫ్రంట్ రన్నర్లుగా తమ స్థానాలను పదిలం చేసుకోవడమే కాకుండా పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి మరింత చేరువైనారు. న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా ఆ ఇద్దరూ తమ ప్రధాన ప్రత్యర్థులైన బెర్నీ శాండర్స్, టెడ్ క్రుజ్‌లను వెనక్కి నెట్టేయడమే కాక, ఇటీవల వరస పరాజయాల తర్వాత మరోసారి తమ అధిక్యతను పదిలం చేసుకోగలిగారు. ట్రంప్ న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించడం అంటే రాష్ట్రంనుంచి లభించే మొత్తం 95 మంది ప్రతినిధులు ఆయన ఖాతాలోకి వెళ్లడమే కాక, జూలై పార్టీ మహాసభ అవసరం లేకుండానే నేరుగానే అభ్యర్థిత్వాన్ని దక్కించుకునే స్థితికి చేరుకుంటారు. ఇక హిల్లరీ క్లింటన్ విజయం ఇప్పటివరకు గట్టి పోటీ ఇస్తున్న శాండర్స్‌ను శాశ్వతంగా పక్కకు నెట్టి వేయడమే కాక పోటీలో కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవలసిన స్థితి ఏర్పడుతుంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో 98 శాతం రిపబ్లికన్ పార్టీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ట్రంప్ 60.6 శాతం ఓట్లతో ఆధిక్యతలో ఉండగా కసిచ్ 25.1 వాతం, క్రుజ్ 14.5 శాతం ఓట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ శిబిరంలో 98 శాతం ఓట్ల లేక్కింపు పూర్తయ్యే సరికి హిల్లరీకి 57.9 శాతం ఓట్లు రాగా, ఆమె ఏకైక ప్రత్యర్థి శాండర్స్‌కు 42.1 శాతం ఓట్లు వచ్చాయి.సిఎన్‌ఎన్ అంచనా ప్రకారం ట్రంప్‌కు 847 మంది డెలిగేట్లు ఉంటే టెడ్ క్రుజ్‌కు 553, జాన్ కసిచ్‌కు 148 మంది ఉన్నారు. మరోవైపు హిల్లరీ క్లింటన్‌కు 487 మంది సూపర్ డెలిగేట్లతో కలుపుకొని 1443 మంది మద్దతు ఉంటే శాండర్స్‌కు 1223 మంది డెలిగేట్ల మద్దతే ఉంది.