జాతీయ వార్తలు

విచ్ఛిన్న శక్తులకు తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగ్రూర్ (పంజాబ్), ఫిబ్రవరి 2: పంజాబ్‌లో నెలకొని ఉన్న శాంతియుత పరిస్థితులను విచ్ఛిన్నం చేయాలని, ఉగ్రవాదంతో అట్టుడికిన వెనుకటి చీకటి రోజుల్లోకి మళ్లీ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్న శక్తులకు అరవింద్ కేజ్రీవాల్ సహకరిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. వౌర్ మండి పేలుడు జరిగిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఆయన ఈ ఆరోపణలు చేశారు. వౌర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి హర్మీందర్ సింగ్ జస్సీ మంగళవారం ‘జన్‌సభ’ నిర్వహించిన కొద్దిసేపటికే వౌర్ మండిలో కారు పేలిపోయి ఆరుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజయిన గురువారం బలియన్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ‘మీరు నివసిస్తున్న వాతావరణం ఎంతో ముఖ్యమైనది. ఈ వాతావరణం భగ్నమై హింస తలెత్తితే, ఆగ్రహావేశాలు వ్యాపిస్తే, రైతులు, కార్మికులు, బలహీనవర్గాలు పనులు కోల్పోతారు. రాష్ట్రం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది’ అని అన్నారు. అధికార అకాలీదళ్, ఆప్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ‘పంజాబ్ ఒక తీవ్రవాద ఆలోచనా విధానం నుంచి మరో తీవ్రవాద ఆలోచనా విధానంలోకి వెళ్లకూడదు. కాంగ్రెస్ అన్ని వర్గాలనూ కలుపుకొని పోయే పార్టీ. పంజాబ్ వేగంగా పురోగమించాలని మేము కోరుకుంటున్నాం’ అని రాహుల్ అన్నారు. గతంలో పంజాబ్‌ను ధ్వంసం చేసిన, పెద్ద ఎత్తున హింసకు పాల్పడిన శక్తులు తిరిగి తల ఎగురవేస్తున్నాయని ఆయన పరోక్షంగా గత ఉగ్రవాదం నాటి పరిస్థితులను ప్రస్తావించారు. ‘బాంబు పేలి ఆరుగురు మృతి చెందారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ శక్తులకు సహకరిస్తున్నారు. ఈ శక్తులు తిరిగి తల ఎగరేసేందుకు తోడ్పడుతున్నారు. ఇది పంజాబ్‌కు అత్యంత ప్రమాదకరమైనది’ అని ఆయన అన్నారు.
గ్రామస్థులతో కలిసి భోజనం
బలియన్ (సంగ్రూర్): పంజాబ్ ఎన్నికల ప్రచారం చివరి రోజయిన గురువారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బలియన్ గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు. గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం ఆయన చాప మీద కూర్చుని పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు.
ముగిసిన ప్రచారం
చండీగఢ్/ పనాజి: పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్ర మోదీకి పరీక్షగా నిలిచిన అయిదు రాష్ట్రాల అసెం బ్లీ ఎన్నికల్లో తొలి దశలో పూర్తయ్యే పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. అకాలీదళ్‌తో కలిసి బిజెపి అధికారాన్ని పంచుకుంటున్న పంజాబ్‌లోని 117 నియోజకవర్గాలకు, బిజెపి స్వతంత్రంగా అధికారంలో ఉన్న తీర రాష్ట్రం గోవాలోని 40 నియోజకవర్గాలకు ఈ నెల 4న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.