జాతీయ వార్తలు

ఏపీలో మరిన్ని అణువిద్యుత్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఏపీలో అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటుకు మరిన్ని స్థానాలను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరిచినట్టు కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ వెల్లడించారు. రష్యా భాగసామ్యంతో ఏపీలోని తీరప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు స్థానాల పరిశీలన జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. గతంలో కావలి వద్ద అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు స్థానిక ప్రజలు వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. భద్రత, జీవనోపాధికి సంబంధించిన పలు అంశాలపై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోవ్వాడ వద్ద అమెరికా సహాయంతో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు మంత్రి జితేందర్‌సింగ్ వెల్లడించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కొవ్వాడ వద్ద ఏర్పాటు చేయనున్న అణు విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు.