జాతీయ వార్తలు

ముహూర్తం కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 3: అంతరిక్ష రంగంలో అసామాన్యమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), తన సరికొత్త ప్రయోగానికి ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటివరకూ సాంకేతికపరంగా భారత్‌కంటే ముందంజలో ఉన్న అగ్రగామి దేశాలు సైతం చేయని సాహసానికి నడుం బిగించిన ఇస్రో, ఈ నెల 15వ తేదీన ఉదయం 9.30 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి37 రాకెట్‌పై 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపబోతోంది.
ఈ ప్రయోగంపై ఈనెల 12న చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం జరగనుంది. అదే రోజు లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత ఇవ్వనుంది. ప్రయోగానికి 48గంటలు ముందు కౌంట్‌డౌన్ ప్రారంభించి 15న ఉదయం 9:30 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనున్నట్లు ఇస్రో వర్గాల నుండి సమాచారం. ఇందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ కేంద్రం వేదిక కానుంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి.
ఇప్పటికే షార్‌కు విదేశీ ఉపగ్రహాలన్నీ చేరుకొన్నాయి. రెండు రోజుల క్రితం కార్టోశాట్-2డి ప్రధాన ఉపగ్రహం కూడా చేరుకుంది. ఉపగ్రహాన్ని క్లీన్ రూమ్‌లో పెట్టి వివిధ పరీక్షలు చేస్తున్నారు. ఇటు మన శాస్తవ్రేత్తలతోపాటు విదేశీ శాస్తవ్రేత్తలు కూడా షార్‌కు చేరుకోవడంతో శ్రీహరికోటలో ప్రయోగ సందడి వాతావరణం నెలకొంది.
ఇంకా ఒక దశ అనుసంధాన పనులు, ఉపగ్రహాన్ని అమర్చాల్సి ఉన్న శాస్తవ్రేత్తలు ఈ నెల 15న ప్రయోగించేందుకు రేయింబవళ్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మొదట 103గ్రహాలను పంపాలనుకొన్న విదేశాల నుండి మరో ఉపగ్రహ పంపేందుకు గిరాకీ రావడంతో మొత్తం 104 గ్రహాలను పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో తుది నిర్ణయం తీసుకొంది.

చిత్రం.. ఐఎన్‌ఎస్-1ఎ ఉపగ్రహాలు