జాతీయ వార్తలు

ఆ మూడు పార్టీలకు ట్రిపుల్ తలాక్ చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. ఈ ఎన్నికల్లో ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్ పార్టీలకు ట్రిపుల్ తలాక్ చెప్పాలని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ ఓ న్యూస్‌చానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇద్దరూ నాణానికి అటు ఇటు’ అంటూ విరుచుకుపడ్డారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో మోదీ, అఖిలేశ్ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. యూపీ ఓటర్లు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌లకు ట్రిపుల్ తలాక్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్లీంలు ములాయం, అఖిలేశ్, రాజీవ్‌గాంధీని తమ నాయకులుగా భ్రమించి నమ్మితే వారికి తీరని ద్రోహం చేశారని ఒవైసీ ఆరోపించారు. దాని ఫలితంగానే ముస్లింలు పిరికివారిగా మిగిలిపోవడంతో అన్యాయం, నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కున్న ముస్లిం యువతను విడుదల చేయిస్తామని హామీ ఇచ్చిన సమాజ్‌వాదీ పార్టీ ఆనక మిన్నకుండిపోయిందని ఒవైసీ విరుచుకుపడ్డారు.