జాతీయ వార్తలు

నగదు ఇక తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: నల్లధనాన్ని నియంత్రించే పేరుతో కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన చర్యలను తీసుకోబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన నిబంధనల మేరకు రూ.3లక్షలకు మించి ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు జరగకుండా కట్టడి చేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ నిబంధనల్లో భాగంగా రూ. 3లక్షలు దాటి నగదు లావాదేవీలు చేస్తే నూటికి నూరు శాతం జరిమానా విధించాలని ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించారని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ ఆధియా పేర్కొన్నారు. ‘ఉదాహరణకు మీరు రూ.4లక్షలు నగదు లావాదేవీలు చేశారనుకోండి, నాలుగు లక్షల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 లక్షలు నగదు లావాదేవీ చేసినట్లయితే యాభై లక్షలూ జరిమానా చెల్లించాలి’ అని అధియా స్పష్టం చేశారు. అయితే ఈ జరిమానా నగదు చెల్లించిన వారికి కాకుండా నగదు స్వీకరించిన వారికి పడుతుందని అధియా స్పష్టం చేశారు. ‘మీరు ఓ ఖరీదైన గడియారాన్ని నగదు పెట్టి కొన్నారనుకోండి.. నగదు తీసుకుని గడియారాన్ని అమ్మినందుకు ఆ దుకాణదారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది’ అని వివరించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనంతోపాటు, ఇళ్లల్లో దాచిపెట్టుకున్న నగదు అంతా బ్యాంకుల్లోకి వచ్చి చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ నల్లధనం సమస్య తలెత్తకుండా కఠినంగా వ్యవహరించేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ కార్యదర్శి అధియా వివరించారు. కార్లు, గడియారాలు, ఆభరణాలవంటి కొనుగోళ్లలో నగదు లావాదేవీలను నియంత్రించటానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు లక్షల పైచిలుకు నగదు లావాదేవీలకు పాన్ నమోదు తప్పనిసరి అన్న నిబంధన యథాతథంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చట్టంలో 269 ఎస్‌టి సెక్షన్‌ను కలపాలని పేర్కొన్నారన్నారు. ‘ఏ వ్యక్తి కూడా ఒక రోజు మూడు లక్షలకు మించి నగదును మరో వ్యక్తి నుంచి స్వీకరించకూడదు’ అని ఆ ప్రతిపాదన సారాంశమని ఆయన వివరించారు. అయితే ప్రభుత్వాలకు, బ్యాంకింగ్ వ్యవస్థలకు, పోస్ట్ఫాసులకు, సహకార బ్యాంకులకు ఈ నిబంధన వర్తించదని ఆయన అన్నారు. బడ్జెట్ ప్రతిపాదించటానికి కొద్ది రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కమిటీ రూ. 50వేల పైన నగదు లావాదేవీలు జరిగితే పన్ను వేయాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.