జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాఖ్‌పై త్వరలో నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘజియాబాద్, ఫిబ్రవరి 5: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఈ సంప్రదాయం వల్ల మహిళలకు గౌరవం లభించడం లేదని, అందువల్ల దీన్ని నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం యుపి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయిన రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.ఈ సామాజిక దురాచారాన్ని అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన చెప్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మూడు అంశాలపై ఈ సమస్యను లేవనెత్తుతుందని చెప్పారు. ఈ సమస్య మతానికి సంబంధించినది కాదని, మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించినదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం మత విశ్వాసాలను గౌరవిస్తుందని, అయితే భక్తి, సాంఘిక దురాచారం కలిసి ఉండవన్నారు.‘ మహిళలను గౌరవించేది తమ పార్టీ ఒక్కటేనని చెప్పిన ఆయన మిగతా పార్టీలు మహిళలకు సముచిత స్థానం ఇవ్వకపోవడమే కాదు, వారిని కనీసం గౌరవంగా చూడవని అన్నారు. బిఎస్పీపై ధ్వజమెత్తిన మంత్రి ఆ పార్టీ కుల రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, మహిళలను గౌరవించాలని చెప్పారు.