జాతీయ వార్తలు

ప్రజలు ఎన్నుకుంది జయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 5: తమిళనాడు ప్రజలు తమ తీర్పు ఇచ్చింది దివంగత నేత జయలలితకు కానీ, ఆమె ఇంట్లో ఉండే వాళ్లకు కాదని డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ఆదివారం తీవ్రంగా విమర్శించారు. జయలలిత చనిపోయారు కాబట్టి ఆమె ఇంట్లో వాళ్లను ఎవరినో తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం సరి కాదని ఆయన అన్నారు. జయ చెలి శశికళను ముఖ్యమంత్రిగా అన్నాడి ఎంకె శ్రేణులు అందలమెక్కించటంపై ఆయన మండిపడ్డారు. శశికళ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటికీ, ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండబోదని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత అసెంబ్లీలో త్వరలోనే మరో ప్రభుత్వాన్ని చూడవచ్చేమో’ అని ఆయన అన్నారు. పార్టీలో తన నాయకత్వానికి ఎలాంటి అడ్డంకులు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘‘మే 2016లో జయలలిత నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అంతే కానీ, పన్నీర్ సెల్వానికో, లేక జయలలితో ఇంట్లో ఉం డే ఏ ఇతరులకో కాదు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా జరుగుతున్న పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వానికి మెజార్టీ ప్రజల మద్దతు ఉందని అనుకోవటం లేదు’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.