జాతీయ వార్తలు

సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి, ఫిబ్రవరి 5: భూమీద మనం ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవటానికి టెక్నాలజీ వినియోగాన్ని అధికం చేస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. పుదుచ్చేరిలో మెగా సైన్స్‌ఫేర్‌ను ప్రారంభించిన ఆయన ‘సమస్యలను ఎదుర్కోవటానికి టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుంటున్నాం. విద్యాసామర్థ్యం పెంచుకోవటం, టెలీ మెడిసిన్ సదుపాయాన్ని మారుమూల ప్రాంతాల్లో కల్పించటం, ఉపగ్రహాలు అందిస్తున్న సమాచారంతో ప్రజలకు సుపరిపాలనను అందించటం, బోర్‌బావుల నిర్మాణం, ప్రకృతి విపత్తులను ముందుగానే కనిపెట్టి ముందుజాగ్రత్త పడటం వంటి అనేక కార్యక్రమాలకు టెక్నాలజీయే ఊతమవుతోంద’ని ఆయన అన్నారు. సొంతంగా 38 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించామని, మన సొంత ప్రయోగ నౌకను కూడా తయారు చేసుకోగలిగామని కిరణ్‌కుమార్ విద్యార్థులకు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పరిశోధన నిమిత్తం పంపించగలిగామని వివరించారు.