జాతీయ వార్తలు

2020 నాటికి కుష్టురహిత ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: 2020 నాటికి కుష్టురహిత ప్రపంచం లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని బుధవారం విడుదల చేసింది. డబ్ల్యు హెచ్‌ఓ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా గుర్తించిన కుష్టు రోగం కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు ఉన్న మూడు దేశాల్లో భారత్ ఒకటి,‘కుష్టు రహిత ప్రపంచం’ లక్ష్యాన్ని సాధించడానికి ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపించకుండా చూడడానికి, ఈ వ్యాధితో ముడిపడిన వివక్ష, మనోవేదనను అంతమొందించడానికి బలమైన కృత నిశ్చయం, వేగవంతమైన కృషి అవసరమని డబ్ల్యు హెచ్‌ఓ అభిప్రాయ పడింది. చర్య తీసుకోవడం, జవాబుదారీతనం ఉండేలా చూడడం, అందరినీ కలుపుకొని పోవడం అనే మూడు సూత్రాలపై ఆధారపడి ఈ అంతర్జాతీయ వ్యూహం రూపొందించడం జరిగిందని, కుష్టువ్యాదిని అదుపు చేయడానికి జరిపే ప్రయత్నాలు అన్ని విషయాలలోను ఈ మూడు అంశాలు ప్రధానంగా చేరి ఉండాలని డబ్ల్యుహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంత ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ బుధవారం ఇక్కడ ఈ అంతర్జాతీయ వ్యూహన్ని ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు. 2020 నాటికి కుష్టు వ్యాధి సోకిన, దాని సంబంధిత లోపాలున్న పిల్లల సంఖ్యను సున్నాకు, కొత్తగా కుష్టువ్యాధిని గుర్తించిన రోగులసంఖ్యను ప్రతి పది లక్షలకు ఒక శాతానికి తగ్గించడం, అలాగే కుష్టువ్యాధి ఆధారంగా వివక్షకు తావిచ్చే అన్ని చట్టాలను నిర్వీర్యం చేయడం ఈ అంతర్జాతీయ వ్యూహం లక్ష్యమని డబ్ల్యు హెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
2014లో వెలుగు చూసిన 2,13, 899 కొత్త కుష్టువ్యాధి కేసుల్లో 94 శాతం కేవలం 13 దేశాలు- బంగ్లాదేశ్, బ్రెజిల్, కాంగో, ఇథియోపియా, భారత్, ఇండోనేసియా, మడగాస్కర్, మైన్మార్, నేపాల్, నైజీరియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, టాంజానియా దేశాల్లోనే నమోదయ్యాయని, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదయిన కుష్టువ్యాధి కేసుల్లో 81 శాతం భారత్, బ్రెజిల్, ఇండోనేసియా దేశాల్లోనే ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. లక్ష్యాన్ని సాధించాలంటే ముఖ్యంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని కంటికి కనిపించే లోపాలు సంభవించడానికి ముందే వ్యాధిని వీలయినంత త్వరగా గుర్తించడం, పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడం ద్వారా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు, సమాజాలను గుర్తించడం, అలాగే వైద్య సేవలను మెరుగుపర్చడం లాంటి అనేక చర్యలను తీసుకోవలసిన అవసరం ఉందని కూడా డబ్ల్యుహెచ్‌ఓ అభిప్రాయ పడింది.