జాతీయ వార్తలు

ప్రమాణంపై అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/ ముంబయి, ఫిబ్రవరి 6: తమిళనాడు ముఖ్యమంత్రిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో వైకె శశికళకు చివరి క్షణంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకూ శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి. శశికళ చేత ప్రమాణం చేయించాల్సిన రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై రాకుండా సోమవారం రాత్రి ముంబయి వెళ్లడంతో అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా కొనసాగిన శశికళపై అనేక కేసులు పెండింగ్‌లో ఉండటం, ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో త్వరలోనే తీర్పునిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించినా సుప్రీం కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టే న్యాయ నిపుణుల సలహాలను గవర్నర్ స్వీకరిస్తున్నారని ఇక్కడి రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు జయలలిత కూడా సహ నిందితురాలు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, తమిళనాడు సిఎంగా
బాధ్యతలు చేపట్టకుండా శశికళను నిరోధించాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. పదవీ స్వీకారం చేసిన తర్వాత సుప్రీం తీర్పు ప్రతికూలంగా వస్తే ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని, దాని వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని పిటిషనర్ స్పష్టం చేశారు. ఆదివారం అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు శశికళను నాయకురాలిగా ఎన్నుకున్న సమయంలో కోయంబత్తూరులో ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావు అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. కాగా, శశికళకు మార్గాన్ని సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయన మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను గవర్నర్ ఆమోదించారు. కాగా, శశికళ ప్రమాణ స్వీకారానికి వేదిక అయిన మద్రాసు యూనివర్శిటీ ఆడిటోరియాన్ని ముస్తాబు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయని అన్నాడిఎంకె వర్గాల్ని ఉటంకిస్తూ చెన్నై నుంచి కధనాలు వెలువడ్డాయి.