జాతీయ వార్తలు

జవడేకర్ కుమారుడి పెళ్లి విందులో కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ కుమారుడి పెళ్లి విందుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రులిరువురూ ఈ పెళ్లి విందులో పాల్గొనేందుకే ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చారు. చంద్రబాబు విందు ముగిసిన వెంటనే విజయవాడకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రే ఢిల్లీ వచ్చిన కెసిఆర్, మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నట్టు సమాచారం.