జాతీయ వార్తలు

విద్యార్థుల డిమాండ్లకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: శ్రీనగర్ నిట్ విద్యార్థులు డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటుతోపాటు జాతీయ పండుగలు నిర్వహించాలన్న డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. ఇటీవల నిట్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా బుధవారం ఇక్కడ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. శ్రీనగర్ నిట్ డైరెక్టర్ రజత్ గుప్తా, కేంద్ర మానవ వనరులు మంత్రిత్వశాఖ అధికారులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆమోదించిన డిమాండ్లన్నీ నిట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని నిర్ణయించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నిట్ క్యాంప్‌లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించాలని, లేని పక్షంలో హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ చేతనైనా ఆవిష్కరింపచేసి స్థానికేతర విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం నింపాలని విద్యార్థులు కోరారు. దీనిపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరీక్ష పేపర్లు కూడా బయట వారితో దిద్దించాలని, క్యాంపస్‌లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటుపై అధికారులు సానుకూలంగా స్పందించారు.