జాతీయ వార్తలు

మచ్చలేని పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర, ఫిబ్రవరి 7: నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో స్వచ్ఛమైన, అవినీతి ఆరోపణలు లేని పాలన సాగుతోందని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని అన్నారు. సైకిల్ గాలితీయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ఎస్‌పి, కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేదని అన్నారు. ఛట్టా అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి లక్ష్మీ నారైన్ చౌదరికి మద్దతుగా రాజ్‌నాథ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్‌పి, కాంగ్రెస్ కూటమిపై హోమ్‌మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. అనైతిక పొత్తులకు రాహుల్ తెరతీశారని ఆయన ధ్వజమెత్తారు. తను మునిగిపోతూ ఎస్‌పిని ముంచేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వస్తే చిన్న రైతులకు పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేద, ధనికుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దుచేశారని హోమ్‌మంత్రి తెలిపారు. నోట్ల రద్దుతో ఉగ్రవాదులు, నక్సలైట్ల నడ్డివిరిగిందని అన్నారు. గత సెప్టెంబర్‌లో భారత్ సర్జికల్ దాడులతో పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మత ఘర్షణలు, లూఠీలు విచ్చలవిడిగా సాగాయని హోమ్‌మంత్రి ఆరోపించారు.