జాతీయ వార్తలు

వారంలో బలపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాలనే వేడెక్కిస్తున్న తమిళనాడు రాజకీయ సంక్షోభం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయ జాప్యం కారణంగానే పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల్లో పోరు తీవ్రమవుతోందన్న కధనాల నేపథ్యంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహగ్దీ సోమవారం రాష్ట్ర గవర్నర్‌కు కీలక సలహా ఇచ్చారు. వారం రోజుల్లో అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించి పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల్లో ఎవరిది మెజార్టీనో తేల్చాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జగదాంబికా పాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య అసెంబ్లీలో బల పరీక్ష జరపాలని రోహగ్దీ స్పష్టం చేశారు. 1998లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి విషయంలో జగదాంబికా పాల్, కళ్యాణ్ సింగ్‌ల మధ్య కూడా ఇదే రకమైన పరిస్థితి తలెత్తిందని, అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి ఎవరిది మెజార్టీనో తేల్చాలని అప్పట్లో సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని అటార్నీ జనరల్ గుర్తు చేశారు.
ఆనందంగా బయటికొస్తాం
ఇక బలపరీక్ష అనివార్యమవుతున్న తరుణంలో శశికళ తన వ్యూహానికి పదును పెట్టారు. విధేయ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు సోమవారం కూడా వారు బస చేస్తున్న గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. రాత్రంతా అక్కడే గడుపుతానని చెప్పిన శశికళ సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఆనందంగా అందరితోనూ బయటికి వస్తానన్నారు. ఈ రిసార్ట్‌ను శశికళ సందర్శించడం వరుసగా ఇది మూడోసారి. 129మంది ఎమ్మెల్యేలు ఈ రిసార్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కలుసుకోవడానికి ముందు కూవత్తూర్ గ్రామమంతా శశికళ తిరిగారని, కొందరి ఇళ్లలోకి కూడా వెళ్లారని తెలుస్తోంది. చాలా మంది ఇళ్లలో జయలలిత ఫొటో దండతో కనిపించిందని, ఇప్పటికీ ప్రజల హృదయాల్లో జయలలితకు సుస్థిర స్థానం ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని శశికళ అన్నారు.