జాతీయ వార్తలు

ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణ నేరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించడం నేరమే అవుతుందని ఎన్నికల కమిషన్ (ఇసి) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించిన ఒక హిందీ దినపత్రికతో పాటు మరో వార్తా సంస్థపై కేసు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ సోమవారం ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఈ నేరానికి పాల్పడిన వారిపై 126ఏ చట్టం కింద కేసు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. ఈ కేసులో నేరం రుజువైతే దోషులకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభకు శనివారం జరిగిన తొలి విడత ఎన్నికలపై రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ‘దైనిక్ జాగరణ్’ అనే హిందీ దినపత్రిక తమ వెబ్‌సైట్‌లో ప్రచురించినట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతో ఈ కేసు దాఖలుకు ఆదేశించింది.