జాతీయ వార్తలు

శక్తివంతమైన మాధ్యమం ‘రేడియో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: శ్రోతలను కట్టిపడేసే సమ్మోహన శక్తి అప్పుడు ఇప్పుడూ రేడియోకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మోదీ ఓ సందేశం ఇచ్చారు. ఆల్ ఇండియా రేడియో శ్రోతలు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. రేడియో మాధ్యమం మరింతగా మిమ్మల్ని ఆకట్టుకోవాలి. నూతన ఆవిష్కరణలతో మీలో ఉత్సాహాన్ని నింపాలి’ అని రేడియో ప్రేమికులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులను ఉత్సాహంగా ఉంచాలని తెలిపారు.
ప్రజలతో మమేకం అవ్వడానికి శక్తివంతమైన మాధ్యమం రేడియో అని ఆయన పేర్కొన్నారు. ‘మన్‌కీ బాత్’ అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎందరికో మన్‌కీబాత్ ద్వారా తనను దగ్గరకు చేర్చిందని మోదీ అన్నారు. ప్రసార మాధ్యమాల్లో రేడియో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు.