జాతీయ వార్తలు

తిరుపతి-నాగర్‌సోల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుపతి-నాగర్సోల్, నాందేడ్-తిరుపతి, సికిందరాబాద్ మీదుగా 52 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమామహేశ్వర్‌కుమార్ తెలిపారు. అయితే ఈ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక చార్జీలతో నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 3 నుంచి మే 26వ తేదీ వరకు నడుస్తాయని వివరించారు. ట్రైన్ నెం. 07417/07418 తిరుపతి-నాగర్సోల్‌కు తిరుపతి ప్రత్యేక రైలు మార్చి 3,10,17,24, ఏప్రిల్ 7,14,21,28 తేదీల్లో, మే 5,12,19,26 తేదీల్లో ఉ 07:30లకు బయలుదేరి అదే రోజు రా.గం. 20:15/20:25లకు సికిందరాబాద్ చేరుకొని రా.గం. 11:55లకు నాగర్సోల్ చేరుకుంటుంది. అదేవిధంగా ట్రైన్ నెం. 07607/07608 హెచ్.ఎస్ నాందేడ్-తిరుపతి, తిరుపతి-హెచ్‌ఎస్ నాందేడ్ ప్రత్యేక రైళ్లుమార్చి 7,14,21,28, ఏప్రిల్ 4,11,18,25 తేదీల్లో, మే 2,9,16,23 తేదీల్లో నాందేడ్ నుంచి సా.గం. 18:45లకు బయలుదేరి ఉ.గం. 00:10/00:40లకు సికిందరాబాద్ చేరుకొని మరుసటి రోజు గం. 14:00లకు తిరుపతి చేరుకుంటుందని ప్రజాసంబంధాల అధికారి పేర్కొన్నారు. ఈరైళ్లు మడ్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, మల్కాజ్‌గిరి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని ఆయన వివరించారు.