జాతీయ వార్తలు

త్రయంబకేశ్వర్‌లో ప్రవేశించిన మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, ఏప్రిల్ 21: ఎట్టకేలకు త్ర యంబకేశ్వర్ ఆలయంలో గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఆలయ ప్రవేశం చేసిన మహిళలు దేవతామూర్తికి పూజలు నిర్వహించారు. పోలీసులు రక్షణలో దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం వస్తధ్రారణ లేదంటూ కొందరు వ్యక్తులు మహిళలు గుడిలోకి కాకుండా అడ్డుకోవడమే కాకుండా దాడికి దిగిన సంగతి తెలిసిందే. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ప్రసిద్ధ త్రియంబకేశ్వర్ ఆలయంలో మహిళల ప్రవేశం కోరుతూ ఆందోళన చేపట్టారు. పూణేకు చెందిన స్వరాజ్య మహిళా సంఘటన అధ్యక్షురాలు వనిత గుట్టే నాయకత్వంలో కార్యకర్తలు గర్భగుడిలో ప్రవేశించి దర్శనం చేసుకున్నారని త్రయంబకేశ్వర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి హెచ్‌పి కొల్హే వెల్లడించారు. ఆలయ ప్రవేశం తమకెంతో సంతో షం కలిగించిందని వనిత స్పష్టం చేశారు. తడి బట్టలు అంటే కాటన్, సి ల్స్ చీరలు ధరించి తాము ఆలయంలోకి వెళ్లామని, ట్రస్టీలు తమనెంతో ఆదరించారని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బృందాలు అక్కడ మోహరించినట్టు కొల్హే చెప్పారు. ఇలా ఉండగా బుధవారం ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడంతోపాటు మ హిళలపై చేయిచేసుకున్న మాజీ ము న్సిపల్ చైర్మన్ సహా 200 మం దిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఈ నెల 14న కూడా స్వరాజ్ మహిళా సంఘటన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయ ట్రస్టీలు, స్థానిక పూజారులు, ఉద్యోగులతోపాటు 250 మందిపై కేసులు నమోదుచేశారు. రాత్రి సమయంలో గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపిస్తూ నగరంలో బంద్ పాటించారు. దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ప్రసిద్ధి త్రయంబకేశ్వర్ ఆలయంలోకి రోజూ ఒక గంటపాటు గర్భగుడిలోకి మహిళలను అనుమతిస్తామని ట్రస్టీలు నిర్ణయించారు. అయితే ఆలయ ఆచార వ్యవహారాల్లో రాజీ ఉండదని, వస్తధ్రారణ ఉండాల్సిందేనని వారు స్పష్టం చేశారు.

చిత్రం ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలో పోలీసుల రక్షణలో దర్శనం చేసుకుంటున్న మహిళలు