జాతీయ వార్తలు

అందరి చూపు భారత్ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 15: భారతదేశం ఒకప్పుడు తన మేధోసంపదతో యావత్ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించింది. ఇప్పుడు మళ్లీ తన విజ్ఞాన నిధి ద్వారా సమస్త దేశాలను తన వైపు తిప్పుకుంటోంది. అందులో ప్రముఖ భూమిక ఇస్రోది.
ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయ పథంలో 1971 నుంచి ఇప్పటివరకు సాగిన ప్రగతిలో ఎన్నో మైలురాళ్లు. ఒక సౌండింగ్ రాకెట్‌తో మొదలుకొని (పరిశోధనాత్మక క్షిపణి) 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టి (పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో) మరోసారి భారతావనిని సగర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో మానవుడిని రోదసిలోకి పంపే యత్నాలూ చేపడుతోంది.
ఇంతకీ ఈ 104 ఉపగ్రహాల మాటేంటి. మొదటగా మనదేశంలోనున్న షార్ నుండి రాకెట్ ప్రయోగం చేయటమే అత్యంత సమర్థవంతమైన ప్రక్రియ. అందువల్ల రష్యా, అమెరికా, సిట్జర్లాండ్ వంటి దేశాలు వాటి ఉపగ్రహాలను షార్ నుండి అంతరిక్షంలోకి పంపించాయి. ఇది చవకైన మార్గం. ఈ శ్రేణిలో కార్టోశాట్-2 మొదటి ఉపగ్రహం. పిఎస్‌ఎల్‌వి-సి 37 భూమికి సాపేక్ష కక్ష్యలోకి కార్టోను 505 కి.మీ దూరంలోనున్న కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తరువాత ఆ ఉపగ్రహం ప్యాంక్రో మాటిక్, బహుళ వర్ణ కెమేరాలతో రిమోట్ సెన్సింగ్‌కి వీలుగా ఉంటుంది. దానివల్ల భూమి ఉపరితల, అంతర్గత వివరాలను చిత్రీకరించవచ్చు. 714 కేజీల ఈ ఉపగ్రహం సౌర శక్తి ద్వారా పనిచేస్తుంది.
అలాగే ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి (నానో) ఉపగ్రహాలు కూడా పంపించింది. ఇవి కేవలం పరిశోధనాత్మక ఉపగ్రహాలు (బరువు 8.4, 9.7 కేజీలు)
ఐఎన్‌ఎస్-1ఎ అనేది భూగ్రహాంతర్గత హైడ్రోజన్ ఫ్లక్స్‌ని పరిశోధించి రోదసి రహస్యాలను తెలుసుకోగలదు. అలాగే ఐఎన్‌ఎస్-1బి, సూక్ష్మ ఆరిగామి కెమెరా టెస్ట్‌చేసి భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలకు సహకారమందిస్తుంది.
అమెరికా ఉపగ్రహాలు 96. అవి డిఒవిఇ, ఎల్‌ఇఎంవిఆర్ రకాలకు చెందినవి. డిఒవిఇ అనే ఉపగ్రహాలు భూమి ఉపరితలాన్ని చిత్రీకరించి సాధారణ, వాణిజ్యపరమైన విషయాలకు ఉపయోగించవచ్చు. ఎల్‌ఇఎంవిఆర్ అనేది ఆటోమాటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా జిపిఎస్ విధానాన్ని సుగమం చేస్తుంది.ఇజ్రాయిల్ ఉపగ్రహాలు 5. ఏవియోనిక్స్ రంగంలో తమ ప్రయోజనాన్ని అందించనున్నాయి. స్విట్జర్లాండ్ ఉపగ్రహం నుండి గురుత్వాకర్షణ తరంగాలను అధ్యయనం చేయొచ్చు. కజకిస్థాన్, యుఎఇ, నెదర్లాండ్స్ ఉపగ్రహాలు పరిశోధనాపరమైన విషయాలను టెస్ట్ చేస్తాయి. రాకెట్‌లో ముందుగా నేలపై నుండి స్టేజ్-1 అమలులోకి వచ్చి 68 కి.మీ ఎత్తులో విడిపోతుంది. తరువాత వరుసగా స్టేజ్-2 జరిగి వాతావరణాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి ప్రవేశిస్తాయి. స్టేజ్-3లోకి వచ్చేసరికి పూర్తిగా వాయురహిత ఆవర్తనంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుండి దాదాపు గంటకు 14400 కి.మీ వేగంతో వెళ్తూ చివరికి రోదసిలోకి చేరేసరికి గంటకు 27360 కి.మీ వేగంతో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుండి వరుసగా ఒక్కొక్క ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. మొదటగా కార్టోశాట్-2, తరువాత ఇన్‌శాట్ 1ఎ, 1బిలు, తరువాత వాటికి 20 కి.మీ పైన మిగతా వాటిని ఉంచుతుంది. దిగ్విజయంగా ప్రవేశపెట్టబడిన ఉపగ్రహాలు వాటి పని సమర్థవంతంగా పనిచేస్తూ భారతదేశానికి ఎంతో కీర్తిని సంపాదించి పెట్టనున్నాయి.