జాతీయ వార్తలు

కొత్త ఖండం.. జీలాండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రపంచంలో మొత్తం ఏడు ఖండాలున్నట్లు ఇప్పటివరకు మనం చదువుకున్నాం. శాస్తజ్ఞ్రులు ఇప్పుడు ఎనిమిదో ఖండాన్ని కనుగొన్నామంటున్నారు. అంతేకాదు దానికి ‘జీలాండియా’ అని పేరు కూడా పెట్టారు. ఆస్ట్రేలియాకు తూర్పున దాదాపు 50 లక్షల చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం ఉండే భూభాగం వాస్తవానికి ఒక ఖండమని, ఉపగ్రహాల చిత్రాలు, శిలల నమూనాలు కూడా ఈ వాదనను సమర్థిస్తున్నాయని వారు అంటున్నారు. కాగా,ఈ కొత్త ఖండానికి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రభావాలు కూడా ఉండి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. న్యూజిలాండ్, న్యూ కలెడోనియాలకు చెందిన ప్రాంతాలతో కూడిన కొత్త ఖండానికి ఈ రెండు పేర్లూ కలిసి వచ్చేలా జీలిండియా అని పేరు పెట్టారు. ‘జీలాండియా’ చాలావరకు సముద్రంలో కలిసిపోయినట్లు కూడా భావిస్తున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన జీలాండియా... ప్రపంచంలోనే అత్యంత చిన్నది, అతి తక్కువ వయసు కలిగిన ఖండం అని కూడా వారంటున్నారు.