జాతీయ వార్తలు

అది ఇంతకుముందు పార్టీ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 16: ఒకే వ్యక్తి పార్టీ చీఫ్, ముఖ్యమంత్రిగా ఉండడమే పార్టీ విధానం అంటూ ఇన్ని రోజులుగా వాదిస్తూ వచ్చిన అన్నాడిఎంకె నేతలు ఇప్పుడు ఆ సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో వికె శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన తర్వాత ఆమెను ముఖ్యమంత్రిగా చేయడం కోసం అన్నాడిఎంకె నేతలు ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్‌గా ఒకే వ్యక్తి ఉండాలనే వాదనను లేవనెత్తడం తెలిసిందే. సుపరిపాలన, సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలయ్యేలా చూడడానికి పార్టీ, ప్రభుత్వ నాయకత్వం ఒకే వ్యక్తి చేతిలో ఉండాలని ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడిఎంకె ప్రచార కార్యదర్శి ఎం తంబిదురై మొదటినుంచీ వాదిస్తూ వచ్చారు. ఈ వాదననే ప్రధానంగా చేస్తూ ఆయన, ఇతర పార్టీ నేతలు తక్షణం ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని శశికళను కోరుతూ వచ్చారు. చివరికి ఆమె అంగీకరించడం, ఈ నెల 5న అన్నాడిఎంకె లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఆమెను ఎన్నుకోవడం జరిగిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటుకు శశికళ సంసిద్ధత తెలియజేసినప్పటికీ గవర్నర్ ఆమెను ఆహ్వానించ లేదు. అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 14న ఆమెను దోషిగా పేర్కొనడం, నాలుగేళ్ల జైలుశిక్ష విధించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం విలేఖరులు పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తారా అని తంబిదురైని ప్రశ్నించగా, ‘ఇప్పుడు ఆ అభిప్రాయం అవసరం లేదు’ అని అంటూ సమాధానాన్ని దాటవేశారు. అయితే మీడియా ప్రతినిధులు సమాధానం కోసం పట్టుబట్టగా నిజానికి ఇంతకుముందు పార్టీ వైఖరి అదే అన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. ‘అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. మేము అలా చెప్పడం నిజమే. న్యాయపరమైన సమస్యల కారణంగాను, ఇప్పుడు చిన్నమ్మ (శశికళ) లేనందున ఆ వైఖరి ఇప్పుడు అవసరం లేదు’ అని తంబిదురై అన్నారు. అంతేకాదు పార్టీ ఇప్పటికే చిన్నమ్మను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుందని, అందువల్ల ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం కాలేదని అన్నారు. కాగా, పళనిస్వామిని ముఖ్యమంత్రిగా నియమించడం గురించి అడగ్గా, ‘ఇది సంతోషకరమైన వార్త. ప్రజలకు మంచి చేయడానికి ఒక అవకాశం’ అని తంబిదురై అన్నారు. అంతేకాదు అన్నాడిఎంకె పార్టీలో ఎలాంటి చీలికా లేదని, తామంతా కలిసే ఉన్నామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పిన ఆయన, అమ్మ పార్టీ ప్రజలకు ఇకపై కూడా మంచి చేస్తుందని, ధర్మం జయించిందని, తామంతా కలిసి అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి చిన్నమ్మ ఆశీస్సులున్నాయని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం లాంటివాళ్లు తిరిగి పార్టీలోకి రావడం గురించి అడగ్గా, ఆయనను పార్టీనుంచి బహిష్కరించామని, ఆయన ఇప్పుడు తమ పార్టీ సభ్యుడు కాడని తంబిదురై అన్నారు.