జాతీయ వార్తలు

సన్‌రైజర్స్‌లో హైదరాబాదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఈ సారి ఐ పి ఎల్‌లో హైదరాబాద్ కుర్రాడికి చోటు దక్కింది. సోమవారం బెంగుళూరులో నిర్వహించిన వేలంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు సన్‌రైజర్స్ జట్టులో చోటు దక్కింది. మాసాబ్‌ట్యాంక్ దర్గా ప్రాంతానికి చెందిన పేద కుటుంభంలో జన్మించిన క్రికెటర్, హైదరాబాద్ రంజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ రూ.2.60 కోట్లకు కొనుక్కుంది. మాసాబ్‌ట్యాంక్‌లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ అయిన మహ్మద్ గౌస్, షాభానాబేగం దంపతుల పెద్ద కొడుకు సిరాజ్. ఏడేళ్ల ప్రాయం నుండే క్రికెట్‌పై దృష్టి సారించిన సిరాజ్ పలు టోర్నమెంట్లలో తన సత్తా చాటాడు. తన మామ షాహీద్ ప్రోత్సహంతో సిరాజ్ క్రికెట్‌లో రాణించాడు. 2010 నుంచి సిరాజ్ హైదరాబాద్ రంజీ
జట్టులో కోనసాగుతున్నాడు. ఇటీవల 2015-16 రంజీ సీజన్‌లో భాగంగా నిర్వహించిన టి20 చాంపియన్‌షిప్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మొత్తం పది మ్యాచ్‌లు అడి 16వికెట్లు తీసుకుని అందరిని అకట్టుకున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ రంజీ మ్యాచ్‌ల్లో తాను చూపుతున్న బౌలింగ్ ప్రతిభను గుర్తించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తనకు స్థానం దక్కటం సంతోషంగా ఉందన్నారు. భారత జట్టులో ఆడాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని సిరాజ్ చెప్పాడు.