జాతీయ వార్తలు

స్పేస్ స్టేషన్‌కూ సంసిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 20:అంతరిక్ష ప్రయోగాల్లో అజేయంగా పురోగమిస్తున్న భారత్‌కు స్పేస్ స్టేషన్‌ను నిర్మించే శాస్త్ర, సాంకేతిక పాటవం ఉందని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. అయితే ఇందుకు దీర్ఘకాల ప్రణాళిక, స్పష్టమైన విధానం అవసరమని స్పష్టం చేశారు. 104 ఉపగ్రహాలను ఏకకాలంలో నింగిలోకి విజయవంతంగా ప్రయోగించి ఇస్రో తన నిరుపమాన పటిమను సంతరించుకున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. స్పేస్ స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన మరుక్షణమే ఎంత మాత్రం వెనుకాడకుండా ఓకే చెప్పేందుకు తాము సంసిద్ధమని ఆయన ఉద్ఘాటించారు. విధానాన్ని రూపొందించి నిధులను సమకూర్చి తగిన వ్యవధి ఇస్తే ఇస్రో ఈ ఘనతను కూడా సంతరించుకోగలుగుతుందని వెల్లడించారు. ఈ విషయంలో ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంతగా రోదసీలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తే అంతగానూ భూమీదున్న వనరులు, వాతావరణ పరిస్థితులను అవగతం చేసుకోగలుగుతామని, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌నూ విస్తరించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.