జాతీయ వార్తలు

నాగాలాండ్ సిఎంగా లీజిట్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, ఫిబ్రవరి 20: నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు షుర్హోజీలీ లీజిట్సు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాజీనామా చేసిన ముఖ్యమంత్రి టిఆర్ జీలాంగ్ స్థానంలో లీజిట్సు బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారు. జీలాంగ్ రాజీనామాను గవర్నర్ పిబి ఆచార్య ఆమోదించారు. తదుపరి చర్యలు తీసుకునేంతవరకు సీఎంగా కొనసాగాలని ఆయన్ను గవర్నర్ కోరారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పట్టణ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించటంతో రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి. వాటిని రద్దు చేయాలంటూ పలు సంస్థలు డిమాండ్ చేశాయి. అంతకుముందు జనవరి 31న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోవటం, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్లతో పెల్లుబికిన ఆందోళనలు ముఖ్యమంత్రి రాజీనామాకు దారితీశాయి. అయితే ఇప్పటికే ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటు జనవరి 31 కాల్పులకు బాధ్యులైన పోలీసు అధికారులనూ బదిలీ చేసింది.