జాతీయ వార్తలు

కారుతో ఫ్లాట్‌ఫామ్‌పైకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: అంధేరీ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి కారు నడిపిన 24 ఏళ్ల క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. 2012లో జరిగిన అండర్ 19 ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో ఆడిన హర్మీత్ సింగ్ ఉదయం 7.30 గంటల సమయంలో సరాసరి కారుతో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చాడు. ఆ సమయంలో ప్లాట్‌ఫామ్ రద్దీగా ఉండడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. వెంటనే స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హర్మీత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారని సీనియర్ ఆర్‌పిఎఫ్ అధికారి వెల్లడించారు. ఐపిసి 147, 145(బి), 154 సహా పలు సెక్షన్లు, రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముంబయి రంజీ ట్రోఫీలో సింగ్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్. ప్రస్తుతం అతడు జమ్మూకాశ్మీర్ రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంతకుముందు స్పాట్ ఫిక్సింగ్ కేసులో హర్మీత్‌పై వేటుపడింది. బుకీలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. విచారణ అనంతరం బిసిసిఐ అతడికి క్లీన్‌చిట్ ఇచ్చింది.

చిత్రం..ముంబయలోని అంధేరీ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి కారుతో దూసుకు వచ్చిన హర్మీత్ సింగ్‌కు అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు