జాతీయ వార్తలు

ఎస్‌పి-కాంగ్రెస్ పొత్తుతో కళతప్పిన మోదీ: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాందా (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు ఒక్కటి కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖంపై నవ్వు తుడిచిపెట్టుకు పోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘గతంలో ప్రధాని మోదీ ఎంతో హుషారుగా కనిపించేవారు. కాని, కాంగ్రెస్, ఎస్‌పిలు కూటమి కట్టడంతో ఆయన ముఖంపైనుంచి చిరునవ్వు చెదరిపోయింది’ అని ఆయన అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌కు దత్తపుత్రుడిని’ అన్న మోదీపై విమర్శలు గుప్పించారు. ‘2014 ఎన్నికల్లో మోదీ గంగామాత తన కుమారుడిని వారణాసికి పిలిచిందని చెప్పారు. వారణాసి తన తల్లి అని మోదీ చెప్పారు. తాను వారణాసి కుమారుడినని ఆయన పేర్కొన్నారు. మోదీజీ, బాంధవ్యాలు పెంపొందించుకునేవే తప్ప ప్రకటించుకునేవి కావు’ అని రాహుల్ అన్నారు. ‘మోదీజీ మీరు ఉత్తరప్రదేశ్ ప్రజలతో బంధాలు నెలకొల్పుకుని ఉంటే, వాటిని కొనసాగించాలి’ అని అన్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ‘ఒకవేళ మోదీ ఇలాంటి చర్య తీసుకోవాలని అనుకుంటే, ఆయన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, అయిదు నిమిషాల్లో ఆ పని చేయొచ్చు. కాని ఆయనకు ఆ చిత్తశుద్ధి లేదు’ రాహుల్ విమర్శించారు.

చిత్రం..అలహాబాద్ సమీపంలోని పథార్‌తల్ గ్రామంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్