జాతీయ వార్తలు

దళిత వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 20: ‘ప్రధాని నరేంద్ర మోదీ దళిత వ్యతిరేకి. బహుజన సమాజ్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు. హోదాను మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. బిఎస్పీని బెహెన్‌జీ సంపత్తి పార్టీ (సోదరి ఆస్తుల పార్టీ) అంటూ కించపర్చడం ఆయన హోదాకు తగదు. ప్రస్తుతం ఆయన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించినా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఒకటి ఉంటుందని మర్చిపోకూడదు’ అంటూ బిఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. సోమవారం సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ‘నరేంద్ర దామోదరదాస్ మోది అంటే నెగెటివ్ దళిత్ మ్యాన్ (దళిత వ్యతిరేకి) అని అర్థం. అందుకే సామాన్యుడు అందించే చిన్న చిన్న విరాళాలతో ఒక ఉద్యమం నడవడం ఆయనకు నచ్చడం లేదు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ‘బిఎస్పీ ఒక ఉద్యమం. తరువాతే రాజకీయ పార్టీ. ఈ విషయం ఆ పెద్ద మనిషికి తెలీదు. దళితులు, బలహీనవర్గాలు, ముస్లింలు తమ కాళ్లమీద తాము నిలబడేలా చేయడానికి నా జీవితానే్న త్యాగం చేశానన్న విషయం అసలు తెలీదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఒకడుగు ముందుకేసి బహుజనులను కించపరిస్తే, తాను రెండడుగులు ముందుకు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిఎస్పీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తాలకు వివరణ ఇస్తూ ‘మూడు నెలల క్రితం దేశవ్యాప్తంగా సాగిన బిఎస్పీ సభ్యత్వ నమోదులో వచ్చిన డబ్బును పెద్ద నోట్లుగా మార్చి ఢిల్లీ పార్టీ ఖాతాలో డిపాజిట్ చేశారు. ఇది తప్పా’ అంటూ ప్రశ్నించారు. ‘బహుజనులు అందించిన రూపాయి రూపాయితో బిఎస్పీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు నచ్చడం లేదు. అందుకే బిఎస్పీపై అవినీతి, అక్రమాల ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు’ అన్నారు.