జాతీయ వార్తలు

నాకూ వేధింపులు ఎదురయ్యాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 20: ఓ పక్క మలయాళ నటి భావనపై లైం గిక వేధింపుల ఆరోపణల కేసు ఓ కొలి క్కి రాకముందే మరో తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తనపైనా ఓ టెలివిజన్ చానల్ ఎగ్జిక్యూటివ్ అధికారి అనుచితంగా ప్రవర్తించారని సోమవారం ఆరోపించారు. ఒక చానల్‌లోప్రోగ్రామింగ్ హెడ్‌గా పనిచేస్తున్న అతను తనతో తప్పుగా వ్యవహరించారన్నారు. ‘‘ఆయన మనం బయట ఎప్పుడు కలుద్దాం అని నన్నడిగారు. ఏదైనా పని కోసమా అని నేను ఆయన్ని అడిగాను. అతను వెంటనే పని కాదు.. ఇతర వ్యవహారాల కోసం అని అన్నాడు.. నేను కోపంతో వెళ్లిపోండి అన్నాను.. అప్పుడతను అంతేనా.. సరే అంటూ వెళ్లిపోయాడు’’ అని వరలక్ష్మి ట్వీట్ చేసింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ‘‘నేను ఒక నటిని. నేను గ్లామర్ పాత్రలు పోషించినంత మాత్రాన నాతో అనుచితంగా మాట్లాడటం సరికాదు. ఇది నా జీవితం. నా శరీరం, నా అభీ ష్టం’’ అని ఆమె స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చుమీరాయని ఆమె వివరించారు. వరలక్ష్మి ప్రముఖ నటుడు శరత్‌కుమార్, నటి రాధికల కూతురు.