జాతీయ వార్తలు

దిగ్విజయ్‌ని దింపాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ పదవి నుండి తొలగించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డితోపాటు పలువురు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి వినతిపత్రాలు సమర్పించటంతోపాటు వ్యక్తిగతంగా కలిసి కూడా స్పష్టం చేశారని అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ కేవలం ఒకరిద్దరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పిందే వింటూ ఇతర నాయకులు, కార్యకర్తలను ఎంత మాత్రం పట్టించుకోవటం లేదనీ, అందువల్లే శాసన సభ్యులు సైతం టిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని అధినాయకత్వం దృష్టికి తెచ్చారు. విభజన అనంతరం తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడానికి ఇదే కారణమని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన వారిని వదిలివేసి హైదరాబాదు డిసిసి అధ్యక్షుడు నాగేందర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామా మల్లేశ్‌ను బలి చేశారని సీనియర్ నాయకులు ఆరోపించినట్లు తెలిసింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయటంలో జరిగిన ఘోరమైన తప్పుల వల్ల పార్టీ ఓటమి పాలైందనీ, అయితే తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసిన వారిపై ఇంత వరకు చర్య తీసుకోలేదని వారు అధిష్ఠానం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. తెలంగాణలో మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో మాత్రమే కాంగ్రెస్ కొంత పటిష్ఠంగా ఉందనీ, పార్టీని పటిష్ఠం చేసినవారిని పదవుల నుండి తొలగిస్తే ఇక పార్టీని రక్షించేది ఎవరని పలువురు నాయకులు ఆవేదన చెందినట్లు ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. దిగ్విజయ్ సింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో... ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అధినాయకత్వం దృష్టికి తీసుకురాకుండా తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నది సీనియర్ నాయకుల ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనేదే లేకుండా పోయిందనీ, తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌ను తప్పుడు విధానాలతో నిర్వీర్యం చేస్తున్నారని సీనియర్ నాయకులు పార్టీ ఆధ్యక్షురాలితో చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి రెండు రోజుల క్రితం సోనియా గాంధీని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ తీరు తెన్నులపై నివేదిక సమర్పించినప్పడు ఆమె పలు అంశాలు తన దృష్టికి రాలేదని చెప్పినట్లు తెలిసింది. రేణుకా చౌదరి తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితిని వివరించిన వెంటనే సోనియా గాంధీ మరో సీనియర్ నాయకుడికి టెలిఫోన్ చేసి వాకబు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

చిత్రం దిగ్విజయ్ సింగ్