జాతీయ వార్తలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రశ్నపత్రం లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: సైన్యంలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఆదివారం ఉదయం పుణె జోన్‌లో నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆర్మీ పరీక్షను రద్దు చేసింది. కాగా ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి థానె పోలీసులు 18 మందిని అరెస్టు చేసి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ధ్రువీకరించడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. సోల్జర్ టెక్నికల్ పరీక్షతో పాటుగా ఆర్మీకి చెందిన వివిధ విభాగాల్లో పోస్టులకోసం నిర్వహిస్తున్న ఈ పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటలకు జరగాల్సి ఉండింది. దేశం నలుమూలలనుంచి ఈ పరీక్ష రాయడానికి అభ్యర్థులు భారీ సంఖ్యలో వచ్చారు. కాగా, ప్రశ్నపత్రం లీక్ చేసిన వారు ప్రతి అభ్యర్థినుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మహారాష్టల్రోని వివిధ ప్రాంతాల్లో ప్రశ్నపత్రం లీకయినట్లు ఆదివారం సాయంత్రానికి వార్తలు వచ్చాయి. దీంతో నాగపూర్, థానె, నాసిక్‌తో పాటుగా గోవాలోను దాడులు జరిగాయి. కొంతమంది అభ్యర్థులు వివిధ హోటళ్లు, లాడ్జీల్లో శనివారం రాత్రే పరీక్ష రాస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాడులు జరిపిన పోలీసులు ప్రశ్నపత్రం లీక్‌తో సంబంధం ఉన్న సుమారు 350 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమాచారం తెలియజేసిన పోలీసులు పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రశ్నపత్రం లీక్‌లో సైన్యానికి చెందిన ఓ ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. థానే సిటీ పోలీసు తరఫున క్రైమ్‌బ్రాంచ్ డిసిపి పరాగ్ మనేరే నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది.

చిత్రం..లీకైన ప్రశ్న పత్రాన్ని ఆదివారం ముంబైలో విలేఖరులకు చూపిస్తున్న క్రైం బ్రాంచ్ అధికారులు