జాతీయ వార్తలు

కాశ్మీర్ గద్దెపై మెహబూబా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 24: జమ్మూ, కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. గురువారం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యేలు మెహబూబా ముఫ్తీని తమ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకోవడంతో త్వరలోనే జమ్మూ, కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధమైంది. పిడిపి సమావేశంలో మెహబూబా మాట్లాడుతూ తనకు మద్దతు తెలియజేసినందుకు, క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచినందుకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరో సారి తనను లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నందుకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆమె పార్టీ కార్యకర్తలే మెహబూబా శక్తి అని అన్నారు.
కాగా, జమ్మూ, కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించడానికి గురువారం ఏర్పాటయిన పిడిపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంపైనే అందరి దృష్టీ ఉండింది. న్యూఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన తర్వాత మెహబూబా మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగే పిడిపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో రాష్ట్రంలో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు పిడిపి, బిజెపి మధ్య పొత్తును తిరిగి కొనసాగించే చివరి ప్రయత్నంగా మెహబూబా మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే అంగీకరించిన అలయెన్స్ అజెండాను అమలు చేయడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఇంతకుముందు బిజెపి స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర గవర్నర్ ఎన్న్ వోహ్రా శుక్రవారం పిడిపి అధ్యక్షురాలు మెహబూబాతో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సత్‌శర్మతో విడివిడిగా సమావేశం కానున్నారు. గత జనవరి 7న ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతితో అదే నెల 8న జమ్మూ, కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం మెహబూబా ముఫ్తీ లోక్‌సభలో అనంత్‌నాగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిడిపి లెజిస్లేచర్ పార్టీలో ఆమెను లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకోవడంతో దేశంలో ఏకైక ముస్లిం మెజారిటీ రాష్టమ్రైన జమ్మూ, కాశ్మీర్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె రాష్ట్రంలోని ఉభయ సభలలో (అసెంబ్లీ, శాసన మండలి) ఏదో ఒక సభకు ఎన్నిక కావడంతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

చిత్రం శ్రీనగర్‌లోని తన నివాసంలో గురువారం నిర్వహించిన పిడిపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న మెహబూబా ముఫ్తి