జాతీయ వార్తలు

‘పనామా’ నివేదిక అందజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పనామా పేపర్స్ కేసులో దర్యాప్తునకు నియమించిన మల్టీ ఏజన్సీ గ్రూప్ (ఎంఏజి) ఆరు నివేదికలను సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు అందజేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఎంఏజి ఆరు నివేదికలతోపాటు ప్రస్తుతం దర్యాప్తు ఏ దశలో ఉన్నదీ తెలపాలని స్పష్టం చేసింది. ‘ఆరు నివేదికలు సీల్డ్ కవర్లో ఉంచి అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం. దీనికి నాలుగు వారాల గడువుఇచ్చాం’ అని ధర్మాసరం పేర్కొంది. బెంచ్‌లో జస్టిస్ ఎఎం ఖాన్వీకర్, జస్టిస్ ఎంఎం శాంతనాగౌడర్ ఉన్నారు. పనామా పేపర్స్ కేసు దర్యాప్తునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిఐటి), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ అధికారులతో ఓ మల్టీ ఏజెన్సీ గ్రూపును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు హాజరై దర్యాప్తు వివరాలు అందజేశారు. ఎంఏజి నివేదిక కాపీ తమకు అందజేస్తే కేసుపై వాదించడానికి వీలవుతుందని పిటిషన్ అడ్వొకేట్ ఎంఎల్ శర్మ అన్నారు. ప్రభుత్వం నియమించిన ఎంఏజి సరైన పద్ధతిలో దర్యాప్తు జరపలేదని ఆరోపించారు.